తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాహనదారులకు రాష్ట్ర హోం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలపై ఉన్న పెండింగ్ చలనాలను రాయితీతో చెల్లింపునకు నేటి తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. అయితే తాజా గా రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ అలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించడానికి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరో 15 రోజుల పాటు ప్రభుత్వం ప్రకటించిన రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించడానికి అవకాశం కల్పించారు.
వాహనదారుల నుంచి స్పందన వస్తున్న నేపథ్యంలో మరో 15 రోజులు గడువు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని హోం శాఖ మంత్రి మహ్మద్ అలీ తెలిపారు. దీంతో ఏప్రిల్ 15వ తేదీ వరకు పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించవచ్చని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 లక్షలకు పైగా చలాన్లను చెల్లించారని తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కు రూ. 250 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని వివరించారు. అలాగే పెంచిన గడువును వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.