విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో మే 7 అర్ధరాత్రి దాటిన తర్వాత స్టైరీన్ గ్యాస్ లీక్ కావడంతో వందల మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా, 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తాజాగా.. ఈ కేసులోని 12 మంది నిందితులకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితులెవరు దేశం దాటి వెళ్లకూడడంటూ.. అలాగే ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఇందులో దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ సీఈవో, డైరెక్టర్ కూడా ఉన్నారు. కాగా, ఈ ఘటనకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అని భావించిన ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి, కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మనుషులతో పాటు మూగజీవాలు కూడా నేలరాలయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరూ కన్నీరు పెట్టారు. అయితే తక్షణమే స్పందించిన ప్రభుత్వం మృతలకు రూ. కోటి, అలాగే బాధితులకు కూడా నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే.