అదేంటి కోన వెంకట్ లవ్‌లో పడ్డారా? బ‌్రేకప్ ఏంటీ… లవ్‌లో పడ్డవాళ్లే కదా బ్రేకప్ చెప్పుకుంటారు.. యస్ కోన వెంకట్ కూడా లవ్‌లో పడ్డారు అమ్మాయితో కాదు కొన్ని సంస్థలతో.. కోన వెంకట్ టాలీవుడ్ స్టార్ రైటర్. అది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది. తన పెన్ను పదును తగ్గింది. దీంతో కొన్ని కాంబినేషన్‌లని సెట్ చేస్తూ నిర్మాణ సంస్థలతో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
డబ్బు లేకుండా కేవలం తన మాటలతో కాంబినేషన్‌లని సెట్ చేస్తూ సినిమాల్లో వాటాల్ని దక్కించుకుంటున్నారు. గత కొంత కాలంగా ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రాలన్నీ దారుణంగా ఫ్లాప్ లుగా నిలుస్తున్నాయి. పండగ చేస్కో చిత్రం నుంచి నిన్నటి `నిశ్శబ్దం` వరకు కోన సెట్ చేసిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్‌లు అవుతున్నాయి. దీంతో కోనతో కలిసి ప్రయాణిస్తున్న పీపుల్స్ మీడియా ఇక నుంచి ఆయనతో బ్రేకప్ కు సిద్ధమవుతోందట.
ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా నిర్మించిన చిత్రం `నిశ్శబ్దం` తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. దీంతో కోన వెంకట్‌తో కలిసి కొనసాగలేమని భావించిన ఈ చిత్ర వర్గాలు సెపరేట్ అవుతున్నాయట.