దత్త పుత్రుడు కాకపోతే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలి – పేర్ని నాని

-

చంద్రబాబు దత్త పుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని ఛాలెంజ్‌ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అని ఫైర్‌ అయ్యారు. అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించ లేదని.. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు అనిపేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ పార్టనర్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోంది దేశంలో?? పాచిపోయిన లడ్డు అని విమర్శించిన బీజేపీతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎందుకు చేతులు కలిపారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పెషల్ స్టేటస్ ఇచ్చారా?? విశాఖ స్టీల్ ప్లాంట్ పై హామీ వచ్చిందా?? తమ పార్టీ ఆవిర్భావ సమయంలో ఏం చెప్పారు?? కాంగ్రెస్ జగన్ పై సీబీఐతో అక్రమ కేసులు పెట్టారని బీజేపీ నాయకులు పార్లమెంటు వేదిక పైనే చెప్పారని గుర్తు చేశారు. ఇవి అక్రమ కేసులని ప్రజలు నమ్మబట్టే 151 సీట్ల భారీ మెజారిటీ ఇచ్చారని.. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం లో కౌలు రైతుల కోసం చట్టం చేయించాలని డిమాండ్ చేశారు . నిజమైన బీసీ అయితే ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కబ్జా చేయరని అయ్యన్నపై విరుచుకుపడ్డారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news