ఏపీ మంత్రి పేర్ని నాని ఇంట తీవ్ర విషాదం

ఏపీ సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని నాని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేర్ని తల్లి నాగేశ్వరమ్మ(82) ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. గత రెండు రోజుల క్రితం ఆంధ్రా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నాగేశ్వరమ్మ ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇక పేర్ని నాని  మాతృమూర్తి నాగేశ్వరమ్మ  మృతి పట్ల ఏపీ సీఎం జగన్ అలాగే ఇతర సహచర మంత్రులు సంతాపం తెలియజేశారు. జన్మనిచ్చిన అమ్మ దూరమవడం పూడ్చలేని శోకమని మంత్రి కన్న బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సంఘటనను తట్టుకునేలా మంత్రి పేర్ని వెంకట్రామయ్య గారికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ఇక మంత్రి పేర్ని నానిని ఏపీ సీఎం జగన్ ఫోన్ లో పరామర్శించారని తెలుస్తోంది.