రప్పా రప్పా కాదు.. చీకట్లో కన్నుకొడితే TDP అయిపోవాలి అని హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ కు దీటుగా రప్పా రప్పా అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి? అన్నారు.

చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలని హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని చెప్పారు. అప్పటి వరకూ రప్పా రప్పా బంద్ చేయాలని వెల్లడించారు. చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా? మన జోలికి వచ్చిన వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి అన్నారు. దింతో పేర్ని నాని వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.