జడ్జ్ ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాకే ఆయనకు మంత్రి పదవి అంటూ హైకోర్టులో పిటిషన్

-

జడ్జ్ ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాకే ఆయనకు మంత్రి పదవి అంటూ హైకోర్టులో పిటిషన్
జడ్జ్ లపై అభ్యంతర వ్యాఖ్యల వెనుక అధికారపార్టీ సోషల్ మీడియా ఉందని, కుట్రలో భాగంగానే దుష్ప్రచారం జరిగిందని, ఈ వ్యవహారంలో సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరుతూ కోర్టులో సోమవారం టీడీపీ నేత మాజీ పోలీస్ అధికారి శివనంద రెడ్డి అనుబంధ పిటిషన్ జారీ చేశారు. న్యాయస్థానం సుమోటోగా తీసుకున్న కేసులలో విచారణ నిష్పక్షపాతంగా సాగటం లేదని అన్నారు. 93 కేస్ లను సుమోటోగా స్వీకరించగా 16 మండిపై 12 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారని, వీరిలో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.

హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది అధికార పార్టీ కి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కావడంతో సీఎం ,విచారణ సంస్థలు వారిని కాపాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీఐ తో హైకోర్టు పర్యవేక్షణ లో జరగాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు హైకోర్టు తీర్పులపై మీడియా సమావేశం పెట్టి మరి ఆడిపోసుకున్నాక ఉన్నత పదవులు దక్కాయి అంటూ పిటిషన్ లో ప్రస్తావించారు. పరిపాలన వికేంద్రీకరణ,సి ఆర్ డి ఏ రద్దు చట్టం పై స్టేటుస్ కో ఇచ్చాక పలాస ఎం ఎల్ ఏ శిదిరి అప్పలరాజు అనవసర వ్యాఖ్యలు చేశారని, కోర్ట్ పైన, న్యాయమూర్తుల పైన అభ్యంతరతరకర వ్యాఖ్యలు తరువాత ఆయనకు మంత్రి పదవి వచ్చిందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news