నయీమ్ అనుచరుడు శేషన్న కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్

-

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్న కస్టడి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. శేషన్నను నాలుగురోజుల కస్టడికి ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. శేషన్న ఆదీనంలోని యాక్షన్ టీం ఎక్కడ? ఎంతమంది? ఉన్నారు అన్నదానిపై విచారించనున్నారు పోలీసులు. నయింకు AK47 ఎలా వచ్చిందో శేషన్నకు తెలిసే అవకాశం? ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఇంకా లెక్కతేలని అక్రమాలు చాలా ఉన్నాయి అంటున్నారు పోలీసులు. శేషన్న రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మొత్తం పది కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆరున్నర సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు శేషన్న. ఎస్ వ్యాస్ , కొనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీధర్ రెడ్డి , కనకాచారి టీచర్, రాములు హత్య కేసులో శేషన్న నిందితుడిగా ఉన్నాడు.

పలు అక్రమ ఆయుధాల కేసలో సైతం నిందితుడు శేషన్న. విద్యార్ధి దశలోనే నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. తాడా కేసులో గతంలో అరెస్ట్ అయినా శేషన్నకు నయీంతో జైల్లో పరిచయం ఏర్పడింది.ఆతర్వాత వరుస హత్యలు, అక్రమాలకు పాల్పడ్డాడు. గ్యాంగ్ స్టార్ నయీం తో కలిసి అనేక నేరాలకు పాల్పడ్డాడు శేషన్న.

Read more RELATED
Recommended to you

Latest news