వాహనదారులకు షాక్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

-

దేశవ్యాప్తంగా…. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీపడుతోంది. అయితే.. తాజాగా మరోసారి ఇ దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి.

నిన్న పెరిగిన పెట్రోల్ ధరలు ఇవాళ కూడా పెరగడం గమనార్హం. తాజాగా లీటర్ పెట్రోల్ పై 24 పైసలు మరియు డీజిల్ పై 32 పైసలు పెంచుతున్నట్లు ఇందన సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపుతో దేశ రాజధాని అయినా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.89 కు చేరగా డీజిల్ ధర రూ. 90.17 కు పెరిగింది.

అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106 కు చేరగా డీజిల్ ధర రూ. 98. 39 కు పెరిగింది. ముంబై లో రూ. 107. 95,కు చేరగా డీజిల్ ధర రూ. 97 . 84 కు పెరిగింది. కోల్ కతా రూ . 102 . 42 కు చేరగా డీజిల్ ధర రూ. 93. 27 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107. 96 కు చేరగా డీజిల్ ధర రూ. 99.82 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news