పండుగ రోజే మహిళలకు షాక్‌ : పెరిగిన బంగారం, వెండి ధరలు

మనదేశంలో బంగారానికి ఉన్న విలువ మరి దానికి ఉండదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఇండియాలో బంగారానికి డిమాండ్ తో పాటు ధర కూడా ఎక్కువే. శుభకార్యాలు అయితే మనదేశంలో చాలామంది బంగారాన్ని కొనడానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే కరోనా మహామారి నేపథ్యంలో మన దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి.

మొన్నటి వరకు 50 వేల మార్కును దాటిన పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త తిరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,170 కి చేరుకుంది. అలాగే కే.వి 22 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు పెరిగి రూ. 44,160 కు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే… కిలో వెండి ధర ఏకంగా 500 రూపాయలు తిరిగి… రూ. 66,300 కు చేరుకుంది. దసరా పండుగ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. త్వరలో మళ్లీ దిగువకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా నిపుణులు సూచనలు చేస్తున్నారు.