కొన్నిప్రాంతాల్లో తటస్థంగా.. మరికొన్ని చోట్ల తగ్గింపు.. ఇవీ ఇవాళ్టి పెట్రోల్ రేట్స్!

న్యూఢిల్లీ: ఆయిల్ ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర స్థిరంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా కాగా, లీటర్ డీజిల్ రూ. 89.87గా ఉంది. కోల్ కతలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.08 కాగా లీటర్ డీజిల్ రూ. 93.02, ముంబై‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.83గా ఉండగా లీటర్ డీజిల్ రూ. 97.45, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 102.49 కాగా లీటర్ డీజిల్ రూ. 94.39గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105 కాగా డీజిల్ రూ. రూ. 97.96గా ఉంది. అత్యధికంగా జైపూర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.35 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 98.69గా విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఇలా జరగుతున్నాయి..