అదే బాటలో పెట్రోల్, డీజిల్.. ఎన్ని మొక్కులు మొక్కినా ధరల్లో నో చేంజ్?

-

న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు చాలా చోట్ల స్థిరంగా ఉండగా ఒకటి, రెండు చోట్ల ఈ రోజు ధర పెరిగింది. పెట్రోల్ పై 33 పైసలు, డీజిల్‌పై 26 పైసల వరకూ పెరిగింది. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా విక్రయాలు జరుగుతున్నాయి.. అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.92 కాగా డీజిల్ రూ. 99.20గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105.83గా ఉండగా డీజిల్ రూ. 97.96గా ఉంది.

Petrol and Diesel
Petrol and Diesel

దీంతో వాహనదారులు లబోదిబో అంటున్నారు. రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ధర ప్రభావం నిత్యావసరాలపై తీవ్రంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయాలని కోరుతున్నారు.

వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు…

న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 104.84, డీజిల్ రూ. 89,87.
కోల్ కత: లీటర్ పెట్రోల్ రూ. 102.08, డీజిల్ రూ. 93.02
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 102.49, డీజిల్ రూ. 94.39.
గురగ్రావ్: లీటర్ పెట్రోల్ రూ. 99.38, డీజిల్ రూ. 90.40
నొయిడా: లీటర్ పెట్రోల్ రూ. 99.00, డీజిల్ రూ. 90.32
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ. 105.71, డీజిల్ రూ. 95.26
భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ రూ. 102.66, డీజిల్ రూ.97.99
చండీఘర్: లీటర్ పెట్రోల్ రూ. 97.93, డీజిల్ రూ. 89.50
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ. 105.83. డీజిల్ రూ. 97.96
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ. 108.92, డీజిల్ రూ. 99.20
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.98.79, డీజిల్ రూ. 90.15
పాట్నా: లీటర్ పెట్రోల్ రూ. 104.47, డీజిల్ రూ. 95.72
త్రివేండ్రం: లీటర్ పెట్రోల్ రూ. 103.82, డీజిల్ రూ. 96.47

Read more RELATED
Recommended to you

Latest news