పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ వో బోర్డు తీపి కబురు అందించింది. పీఎఫ్ డిపాజిట్లపై 2018-19 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని 8.65 శాతానికి పెంచారు. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఇది 10 బేసిక్ పాయింట్లు ఎక్కువ. దీంతో దాదాపు ఆరు కోట్ల మంది పీఎఫ్ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
పీఎఫ్ కు సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ అధికారం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) కే ఉంటుంది. ప్రతి సంవత్సరం వడ్డీ రేట్లపై సీబీటీ నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత ఆర్థిక శాఖ ఆమోదిస్తుంది.
2017-18 లో పీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం ఉండగా… 2016-17 లో 8.65, 2015-16 లో 8.8 శాతం, 2014-15లో 8.75 శాతం, 2013-14 లో 8.75 శాతంగా ఉంది.