అసలు కథ వర్మ చెబుతాడా.. మధ్యలో ఆగిన మహానాయకుడు..!

183

ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుండి వివాదాలు మొదలయ్యాయి. తండ్రి బయోపిక్ చేయాలని బాలకృష్ణ ఓ ప్రయత్నం చేయగా ఆ ఛాన్స్ తనకి రాలేదని ఎన్.టి.ఆర్ అసలు కథ తను చెబుతా అంటూ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టాడు వర్మ. లక్ష్మీ పార్వతి పాత్ర ప్రధానంగా ఎన్.టి.ఆర్ జీవిత కథను చెబుతున్నాడు వర్మ.

బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎన్.టి.ఆర్ జీవితాన్ని పరిపూర్ణంగా చూపించలేదు. కథానాయకుడు ఎన్.టి.ఆర్ సినిమా ప్రస్థానం చూపించగా.. మహానాయకుడు రాజకీయ ప్రస్థానంతో సాగింది. అయితే ఎన్.టి.ఆర్ చివరి రోజుల్లో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎంత బాధపెట్టారన్నది లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో చూపిస్తున్నాడు. ముందునుండి చెబుతున్నట్టుగా ఎన్.టి.ఆర్ అసలు కథ ఇదే అంటూ వర్మ ప్రమోట్ చేస్తున్నాడు.

మరి మధ్యలో ఆగిన మహానాయకుడు కథని వర్మ పూర్తి చేస్తున్నాడు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ఎఫెక్ట్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మీద బాగా పడ్డది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.