క్రేజీ న్యూస్‌ : సలార్‌ నుంచి ఫోటో లీక్‌.. మామూలుగా లేదుగా..

-

కేజీఎఫ్‌ సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో డార్లింగ్‌ ప్రభాస్‌ నటిస్తున్న సినిమా సలార్‌.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని.. ప్రభాస్‌ అభిమానులే కాకుండా.. అందరూ వేయిట్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్‌ చేసిన కేజీఎఫ్‌ 2 సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంకా ఆ సినిమా వసూల్లు రాబడుతోంది. అయితే.. దీంతో సలార్‌పై మరింత ఆసక్తి పెరుగుతుండడంతో.. సలార్‌ నుంచి ఏ ఆప్డేట్‌ వచ్చిన వైరల్‌గా మారుతోంది. ఇప్పుడు సలార్‌ సెట్స్‌ నుంచి ఓ పిక్‌ లీక్ అయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Prabhas In Salaar Shoot

కేజీఎఫ్ ను దున్నేసేంత మాస్ గా ప్రభాస్ ఈ లీక్ అయిన ఫోటోలో కనిపిస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సలార్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి అయ్యిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ మద్య కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబో సినిమా మళ్లీ షూటింగ్ ప్రారంభం అవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ అతి త్వరలోనే సలార్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news