ఓ ప్రాముఖ్య సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా 750 కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాంటి కేసులో టీ సుబ్బిరామి రెడ్డి కూతురు సుపరిచితురాలు, నిర్మాతా, వ్యాపారవేత్త పింకీ రెడ్డి ని కూడా పోలీసులు విచారిస్తున్నారు. సీబీఐ పోలీసులు విచారించడమే కాదు ఈ కేసులో పింకీ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా వారి వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు సీబీఐ అధికారులు.
వివరాల్లోకి వెళితే… జీవీకే సంస్థ నిర్వహణలో ఉన్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ లో నిధుల గోల్ మాల్ అయ్యాయి. ఎయిర్ పోర్ట్ అథారిటి అభివృద్ధికి కేటాయించిన నిధులతో నవీ ముంబై పరిసరాల్లో జీవీకే గ్రూప్ రియలెస్టేట్ వ్యాపారం చేసినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ చేసిన నిమిత్తం వచ్చిన ఆదాయాన్ని కంపెనీలోని ఉద్యోగులకు జీతాల రూపంలో కంపెనీ పంచేసింది. ఇక ఈ కేసులో ప్రముఖ వ్యాపార వేత్త సీనీ నిర్మాత పింకీ రెడ్డి పాత్ర కూడా ఉండటం గమనార్హం. పింకీ రెడ్డి ట్రావాల్స్ సంస్థ ద్వారా కూడా డబ్బు పెద్దమొత్తంలో బదిలీ అయినట్టు సీబీఐ ఆధారాలు సంపాదించింది. ఈ నేపద్యంలో జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, పింకీరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ కుంభకోణం దాదాపుగా 750 కోట్లకు పైమాటే అనే అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.