తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ కాంతారావును హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారు కాలేజ్ పార్టనర్స్. హత్య కోసం 50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట.
ముందుగా ఐదు లక్షలు చెల్లించిన గేట్ కాలేజీ భాగస్వాములు…మిగతావి తర్వాత ఇస్తామని చెప్పారట. కాంతారావును హత్య చేసే కుట్రలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారు. అయితే… తప్పించుకొని వెళ్లిపోయారు కాంతారావు. ఆ తర్వాత మరోసారి కోదాడ పట్టణంలో కారును ఢీకొట్టింది డీసీఎం. స్వల్ప గాయాలతో బయటపడ్డారు కాంతారావు. ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసి 12 మంది గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.