సెల్ ఫోన్ పక్కన పెట్టండి గురూ .. ఈ పని చేయండి ముందు ..!

-

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉంది. దాదాపు మూడు లక్షలకు పైగా భూమి మీద ఉన్న ప్రజలకు ఈ వైరస్ సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరోపక్క కరోనా మరణాలు పెరిగిపోవడంతో ప్రభుత్వాలు మరియు నాయకులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వైరస్ ప్రభావం ఇండియాలో కూడా ఎక్కువగా ఉండటంతో ప్రధాని మోడీ దేశ ప్రజలకు జనతా కర్ఫ్యూ కి పిలుపు ఇవ్వటం జరిగింది. ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. Image result for cell phone avoidకేవలం వ్యక్తిగతంగా కాకుండా భావితరాలకు మంచి చేయాలంటే ముఖ్యంగా తల్లులను తండ్రులను కాపాడుకోవాలంటే కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే జ‌న‌తా క‌ర్ఫ్యూ వ‌ల్ల ఇంట్లో ఉన్నాం క‌దా అని మ‌న టైంను ఫోన్‌కే ప‌రిమితం చేసేయొద్దు.

 

నిజానికి జ‌న‌తా క‌ర్ఫ్యూ అంటే.. అంద‌రూ ఇళ్ల‌లోనే ఉంటాం. సో.,. మ‌న‌తో పాటు మ‌న  స్నేహితులు కూడా వారి వారి కుటుంబాల‌తో గ‌డిపే స‌మ‌యం ఇది అని గుర్తించి.. మ‌నం చాటింగులు త‌గ్గించేసుకుందాం. ఇటువంటి సమయంలో అయినా సెల్ ఫోన్ పక్కన పెట్టి, కొంచెం మానవ సంబంధాలు కలిగి మాట్లాడుకోవాలని, కుటుంబ సమేతంగా హ్యాపీగా ఉండాలని చాలామంది సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news