దేశవ్యాప్తంగా ఆదివారం వరకు కరోనా కేసులు 341కి చేరుకున్న విషయం విదితమే. మరో వైపు ఇవాళ రాత్రి 9 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటించనున్నారు. ప్రస్తుతం జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. కాగా కరోనాను ఎదుర్కొనేందుకు గాను ఇప్పటికే ఆలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్ మా, యాపిల్ సీఈవో టిమ్‌కుక్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌లు ముందుకు రాగా.. వారి జాబితాలో ఆనంద్ మహీంద్రా కూడా చేరారు. కరోనాపై పోరాటానికి తన వేతనాన్ని విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పలు ఇతర సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గాను అవసరం అయిన సామగ్రిని మహీంద్రా ఫ్యాక్టరీలలో తయారు చేస్తామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ముఖ్యంగా రోగులకు అవసరమైన వెంటిలేటర్లను తయారు చేస్తామని తెలిపారు. అలాగే మహీంద్రా హాలిడేస్‌కు చెందిన హోటళ్లు, రిసార్టులు దేశవ్యాప్తంగా అనేకం ఉన్నాయని, వాటిని ప్రభుత్వానికి అందజేస్తామని, ఆర్మీకి తమ సంస్థ సహాయం చేస్తుందని, కరోనా చికిత్సకు సదరు రిసార్టులు, హోటల్స్‌ను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా పై విషయాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
—A lockdown over the next few weeks will help flatten the curve & moderate the peak pressure on medical care. —However, we need to create scores of temporary hospitals & we have a scarcity of ventilators. (2/5)
— anand mahindra (@anandmahindra) March 22, 2020
—Our Projects team stands ready to assist the Govt/Army in erecting temporary care facilities. —The Mahindra Foundation will create a fund to assist the hardest hit in our value chain (small businesses & the self employed) (4/5)
— anand mahindra (@anandmahindra) March 22, 2020
—We will encourage associates to voluntarily contribute to the Fund. I will contribute 100% of my salary to it & will add more over the next few months. I urge all our various businesses to also set aside contributions for those who are the hardest hit in their ecosystems (5/5)
— anand mahindra (@anandmahindra) March 22, 2020