దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 341 మందికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీనితో ఇప్పుడు కేంద్రం కీలక అడుగులు వేస్తుంది. సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. మన దేశంలో కరోనా బాధితులు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 13,609 కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 188 దేశాలకు కరోనా వ్యాధి సోకింది.
కర్ణాటకలో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా సోకినా 75 జిల్లాలను పూర్తిగా లాక్ డౌన్ చెయ్యాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. జనతా కర్ఫ్యూ ని కూడా అన్ని రాష్ట్రాలు పొడిగించే యోచనలో ఉన్నాయి. తెలంగాణా 24 గంటలు చేస్తుండగా… ఆంధ్రప్రదేశ్ మూడు రోజులు చెయ్యాలని భావిస్తుంది.
ఇక రాజస్థాన్ , హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఇక తెలంగాణా కూడా ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించే యోచనలో ఉంది. కెసిఆర్ అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క రోజులోనే దేశంలో ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. గుజరాత్, మహారాష్ట్ర లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.