రైతులకి గుడ్ న్యూస్… పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు ఎప్పుడంటే..?

-

కేంద్రం రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పధకం ద్వారా ఎంతో మంది రైతులు చక్కటి లాభాలను పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6,000 కేంద్రం ఇస్తోంది. అది రైతులకి ఎంతగానో ఉపయోగ పడుతుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు 11 వాయిదాల డబ్బులను ప్రభుత్వం రైతులకి ఇచ్చింది. అయితే ఇక ఇప్పుడు 12వ విడత డబ్బులను త్వరలో ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డబ్బుల కోసం లబ్ధిదారులు చూస్తున్నారు. కేంద్రం ఈ రూ.6,000 పెట్టుబడిని మూడు వాయిదాల్లో ఇస్తుంది. రెండు వేలు చొప్పున ఇవి వస్తాయి. నాలుగు నెల తేడాతో ఇస్తారు.

ఇవి నేరుగా రైతుల అకౌంట్ లోకే వేస్తారు. ఈ విడత డబ్బులు మరో రెండు వారాల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం వుంది. ఇక ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్‌కు సంబంధించిన సమాచారం రైతులకు స్వయంగా తెలుస్తుంది. ఈ కేవైసీ స్టేటస్‌లో ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వస్తే అకౌంట్ లో మనీ డైరెక్ట్ గా పడతాయి. దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే 155261 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు డైల్ చేసి తెలుసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news