రైతులకు కేంద్రం బిగ్ షాక్..2 కోట్ల మేర తగ్గిన పిఎం కిసాన్ లబ్ధిదారులు !

-

రైతులకు కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పీఎం కిసాన్ నిధుల లో కోత విధించనుంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా గత మూడు విడతల్లో పీఎం కిసాన్ పథకం కింద 10.40 కోట్ల మంది లబ్ధి చెందుతున్నారు. అయితే,12వ విడతలో ఈ సంఖ్య 8.40 కోట్లకు పడిపోయింది. దీంతో ఏకంగా రెండు కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం నుంచి తొలగిపోయారు.

కేంద్ర ప్రభుత్వం చెల్లించే నగదు 22 కోట్ల నుంచి 17 వేల కోట్లకు తగ్గిపోయింది. గతంలో ఏపీలో 44 లక్షల మందికి లబ్ధి చేకూరగా, ఈసారి నాలుగు లక్షల మంది తగ్గారు. ఇక ఈ లెక్కన తెలంగాణలో 35 లక్షల మందికి నగదు అందుతుండగా ఈసారి ఏకంగా మూడు లక్షల మంది తగ్గిపోయారు. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో కూడా దాదాపు మూడు లక్షల మంది తగ్గిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకం ద్వారా ప్రతి ఏటా మూడు విడతల్లో ఒక్కో రైతుకు 6000 రూపాయలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 11 విడతల్లో డబ్బులు విడుదల చేసింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news