రేపు దేశ ప్రధానికి నరేంద్ర మోదీ ఒక ముఖ్యమైన కార్యక్రమానికి శంకు స్థాపన చేయనున్నారు. భారతదేశంలోని 14వ శతాబ్దం లో ఒక ఆధ్యాత్మిక కవి మరియు సంఘసంస్కర్త గా ప్రత్యేకత గాంచిన వ్యక్తి సంత్ రవిదాస్ కు గుర్తుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ దేవాలయానికి మోదీ శంకుస్థాపన చేయడానికి వెళుతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ దేవాలయ నిర్మాణానికి దాదాపుగా రూ. 100 కోట్లు ఖర్చు చేయనున్నారట. కాగా ఈ దేవలయం కోసం 10 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించడానికి ప్లాన్ చేశారు. అంతే కాకుండా ఈయన రచించిన రచనలు మరియు ఫిలాసఫీ ని ప్రజలకు తెలియచేయడానికి రవిదాస్ పేరు మీదుగా ఒక మ్యూజియం ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేయనున్నారు.
ఇక మోదీ పాలన గురించి మరియు వచ్చే ఎన్నికలలో బీజేపీ ఎలా గెలుస్తుందన్న అన్ని విషయాలను నిన్న పార్లమెంట్ లో ప్రస్తావించారు.