ప్రపంచాన్ని కరోనా మరోసారి గడగడలాడిస్తున్న తరుణంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత్ లో కొవిడ్ పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో కరోనా పరీక్షలు మరింత పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని సూచించారు.
‘‘కరోనా ఇంకా అంతం కాలేదు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి. పండగల సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రాలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకలు అందుబాటులో ఉంచాలి. అవసరమైన మందులు, ధరలపై పర్యవేక్షించాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు.