సూర్యగ్రహణానికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలను ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ పంచుకున్నారు. భారతీయులందరిలాగే.. తాను కూడా సూర్య గ్రహణాన్ని చూసేందుకు ప్రయత్నించానని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ లో ప్రధాని ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఎంతో మంది భారతీయుల మాదిరే తాను కూడా ఉత్సాహంగా గ్రహణాన్ని వీక్షించానని చెప్పారు. అయితే, మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని తెలిపారు.
కానీ.. గ్రహణం గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. మరియు గ్రహణానికి సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్‌లో తిలకించానని తెలిపారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా పెద్దలతో పాటు పిల్లలు కూడా భారీ సంఖ్యలో ఈ గ్రహణాన్ని వీక్షించారు. గ్రహణాన్ని వీక్షించేందుకు హైదరాబాదులోని బిర్లా ప్లానెటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారు.