నిజామాబాద్: కాంగ్రెస్ అడుగుజాడల్లోనే తెరాస అధినేత …మోడీ

-

తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ప్రధాని మోడీ విమర్శించారు.ఈ రెండు పార్టీలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్‌లో తెలంగాణ భాజపా ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ… కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలన గా మర్చారన్నారు. దేశంలో 50, 60 ఏళ్లు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. అదే తరహాలో తెలంగాణలో కూడా ఏ అభివృద్ధి పనులు చేయకుండా అధికారంలోనే కొనసాగేలా కేసీఆర్ కుటుంబం భావిస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ విద్యార్థి కేసీఆర్: తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్ అతనికి విరోధి పార్టీ కాదన్నారు. తెరాస, కాంగ్రెస్ లు రెండు పార్టీలు అసత్యాలు చెప్పడంలో పోటీ పడుతున్నాయి. కొద్ది రోజుల కిందట తెలంగాణలో జరిగిన బహిరంగ సభకు సోనియా గాంధీ వచ్చారు. వేదికపై ఆమెతోపాటు ఆమె సుపుత్రుడు ఈ రాష్ట్రంలో కుటుంబ రాజకీయ పార్టీ తెరాస అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన, అభివృద్ధి జరగాలంటే భాజపాను గెలిపించాలని కోరారు.
తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు…
సభా ప్రారంభ సమయంలో మోదీ కాసేపు తెలుగులో మాట్లాడి అందరిని ఆకట్టుకున్నారు. ‘‘ఇందురు ప్రజలకు నా శుభాభినందనలు. భాసర సరస్వతి ఆశీర్వదాలు, గోదావరి, మంజీర, కృష్ణానదులు ప్రవహించే ఈ నేల పవిత్రమైనది. రాజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదరించిన చరిత్ర గల భూమి ఇది. మార్పు కోసం, ప్రగతి కోసం అమరవీరుల ఆకాంక్షలు సాకారం కోసం తరలివచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు’’ అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించడంతో సభా ప్రాంగణమంతా..భారత్ మాతాకి జై అంటూ హోరెత్తింది.

Read more RELATED
Recommended to you

Latest news