టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో భాగంగా పలువురు భారత క్రీడాకారులు సత్తా చాటిన విషయం విదితమే. అయితే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే నీరజ్‌కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోదీ నీరజ్‌కు ఫోన్ చేసి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
నీరజ్ చోప్రా ఒలంపిక్స్‌లో స్వర్ణం గెలవడంతో ఆయనకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. కొంత సేపు ఆసక్తికరంగా సంభాషించారు. నీరజ్ పోటీలో పాల్గొనేటప్పుడే గోల్డ్ మెడల్ సాధిస్తాడన్న విశ్వాసం ఉందని మోదీ అన్నారు. గోల్డ్ మెడల్ సాధించి భారత కీర్తి పతాకలను విశ్వవ్యాప్తం చేసినందుకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు.
#WATCH | During a phone call, PM Narendra Modi congratulates javelin thrower Neeraj Chopra who won #Gold medal at #TokyoOlympics today pic.twitter.com/rGwiTJmx4U
— ANI (@ANI) August 7, 2021
కాగా భారత్ ఒలంపిక్స్‌లో 2 వెండి పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించగా, తాజాగా వచ్చిన గోల్డ్ మెడల్‌తో బోణీ కొట్టినట్లయింది. ఈ క్రమంలో భారత్ ఖాతాలో ప్రస్తుతం 7 మెడల్స్ చేరాయి.