వారికి గుడ్ న్యూస్… మరో రెండేళ్లకి ఆ స్కీమ్ గడువు పొడిగింపు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో లాభాలను పొందొచ్చు. అయితే కేంద్రం వీధి వర్తకులకు కూడా ఓ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. అదే ఆత్మనిర్భర్ నిధి. అయితే ఆ స్కీమ్ ని ఇప్పుడు మరో రెండేళ్ళకి పొడిగించారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

మార్చి 2022తో ముగిసిన ఈ స్కీమ్ గడువును 2024 డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పీఎం స్వానిధి స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు లోన్స్ ని ఇస్తారు. ఈ స్కీమ్ చాలా మంది కుటుంబాలకి హెల్ప్ అయ్యింది.

ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం వీధి వర్తకులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 వేల వరకు రుణాలను అందించడం జరిగింది. సరైన సమయానికి చెల్లిస్తే వార్షికంగా 7 శాతం వరకు వడ్డీ రాయితీని అందిస్తోంది. దీన్ని త్రైమాసికం లెక్కన వీధి వర్తకుల అకౌంట్లో క్రెడిట్ చేస్తోంది. గవర్నమెంట్ రూ.5 వేల కోట్ల వరకు రుణాలను ఈ స్కీమ్ ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నేటి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసే రుణాల మొత్తం రూ.8,100 కోట్లకు పెరిగింది. దీని వలన వీధి వర్తకుల వ్యాపారం బాగుంటుంది. కరోనా మహమ్మారి సమయంలో చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పాడడం వలన 2020 జూన్‌లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా వీధి వర్తకులపై ఉండటంతో మరో రెండేళ్ల పాటు ఈ స్కీమ్‌ను ఎక్స్టెండ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news