ప్రపంచానికి మోదీ గుడ్ న్యూస్. వచ్చే ఏడాది 5 బిలియన్ల కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి

-

కరోనాతో ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. కరోనా కారణం పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. మరోవైపు వైరస్ మ్యుటేషన్ చెందుతూ కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జీ 20 వేదిక పై నుంచి కీలక ప్రకటన చేశారు. ప్రపంచం కోసం వచ్చే ఏడాదిలో 5 బిలియన్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. ప్రధాని ఇటీవల జీ 20 సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లారు. సమావేశంలో ’గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ హెల్త్‘ అంశంపై మాట్లాడారు. భారత దేశం ప్రపంచ బాధ్యత గురించి ఎప్పుడూ సీరియస్ గానే ఉంటుందని ప్రధాని వెల్లడించారు. కరోనాను నివారించేందుకు చాలా మార్గాలు ఉన్నాయని, ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్లను WHO త్వరితగతిగా గుర్తించాలని కోరారు.

భారత దేశం ప్రపంచ ఫార్మసీ రంగంలో అగ్రగామిగా ఉందని, దాదాపు 150 దేశాలకు జౌషధాలను ఎగుమతి చేస్తున్నామని గుర్తు చేశారు. అతి తక్కువ సమయంలో భారత దేశం కరోనా వ్యాక్సిన్లను తయారు చేసిందని ఆయన అన్నారు. ఇటీవల భారత దేశంలో 100 కోట్ల డోసులను అందించామని తెలిపారు. దీని ద్వారా ప్రపంచంలో ఆరోవంతు జనాభాను సురక్షితంగా ఉంచడమే కాకుండా.. వ్యాధి వ్యాప్తిని, వ్యాధి మ్యుటేషన్లను తగ్గించామని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version