నేటి నుంచి MMTS రెండోదశ సేవలు అందుబాటులోకి..

-

హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎంఎంటీఎస్‌ రెండోదశ ఎట్టకేలకు అందుబాటులోకి వస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఎంఎంటీఎస్‌ రెండోదశను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌కు మొదటి రైలు వెళ్లనుంది.

ప్రధానమంత్రి ప్రారంభించిన అనంతరం రోజూ సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌కు 10, మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌కు 10 ఎంఎంటీఎస్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా మీదుగా ఉందానగర్‌కు 10 సర్వీసులు నడుస్తాయి. ఉందానగర్‌ నుంచి 10 ఎంఎంటీఎస్‌లు లింగంపల్లికి నడుస్తాయి. ఇలా మొత్తం రెండో దశలో మొత్తం 40 సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. లింగంపల్లి – ఫలక్‌నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్‌లకు అదనంగా ఉందానగర్‌కు మొత్తం 20 సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఎంఎంటీఎస్‌లు రేపు లాంఛనంగా ప్రారంభమై.. ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో నడుస్తాయి.

  • మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌కు సమయాలివే..
    ఉదయం 6.05, 7.20, 8.50, 11.35, మధ్యాహ్నం 12.30, 3.30, సాయంత్రం 5.00, 6.50, రాత్రి 8.15, 10.10 గంటలకు
  • సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌కు సమయాలివే..
    ఉదయం 5.45, 7.30, 8.40, 10.10, మధ్యాహ్నం 12.50, 1.45, సాయంత్రం 4.45, 6.15, రాత్రి 8.40, 9.30 గంటలకు
  • లింగంపల్లి నుంచి ఉందానగర్‌కు సమయాలివే..
    ఉదయం 5.50, 6.30, 8.25, 9.05, 10.05, మధ్యాహ్నం 12.40, సాయంత్రం 4.35, 6.35, రాత్రి 9.15, 9.45 గంటలకు
  • ఉందానగర్‌ నుంచి లింగంపల్లికి సమయాలివే..
    ఉదయం 4.00, 6.05, 6.55, 7.55 9.35, 10.30, 11.30, మధ్యాహ్నం 3.20, సాయంత్రం 5.45, రాత్రి 8.10 గంటలకు ఎంఎంటీఎస్‌లున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news