కాసేపట్లో ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!

-

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నేడు కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్‌ విధానంలోనే ఈ మీటింగ్ జరుగనుంది. కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా దేశంలో ఏర్పడిన పరిస్థితులపై మంత్రులతో మోదీ చర్చిస్తారు. ముఖ్యంగా రోడ్డు రవాణా, పౌర విమానాయశాఖ, టెలీకాం మంత్రిత్వశాఖలకు సంబంధించిన పనులపై చర్చించనున్నారు. ఇటీవలకాలంలో ప్రధాని మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులుంటాయని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే శివసేన, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగాయి.  కూటమిలో భాగంగా కేంద్రమంత్రులుగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, మరో కేంద్రమంత్రి సురేష్‌ అంగడి ఇటీవల మృతి చెందారు. దీంతో  ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. ఆయాశాఖలను ఇతర మంత్రులకు అప్పగించారు. అయితే అదనపు భారంతో మంత్రులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌‌ను ప్రధాని మోదీ విస్తరిస్తారని సమాచారం. వరుణ్‌ గాంధీ, జ్యోతిరాధిత్య సింధియాతో పాటు మరో ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news