బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..!

-

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన సేవకుడు. దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలకు నేతృత్వం వహిస్తున్నారు . విధి నిర్వహణ కోసం పగలనక రాత్రనక ప్రధాని పని చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మనందరికీ ఆదర్శం. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈసారి బీజేపీ సభ్యత్వ నమోదు 10 కోట్ల కు చేరనుంది . అంతకు ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది.

దేశంలో 1500 పెద్ద చిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ మాత్రమే రాజ్యాంగం ప్రకారం కార్యక్రమాలను అమలు చేస్తుంది. బీజేపీ లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సభ్యత్వ నమోదు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. మొత్తం మూడు దశల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. బీజేపీ సభ్యత్వ నమోదు మిస్డ్ కాల్, వాట్సాప్ ద్వారా, బీజేపీ వెబ్సైట్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, నమో ఆప్ ద్వారా, బీజేపీ పార్టీ రసీదు ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చు అని జేపీ నడ్డా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news