గౌతమ్ అదానీ..మోడీ బినామీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కవితకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోంది.. దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహించారు మంత్రి కేటీఆర్.
దర్యాప్తు సంస్థలను కేంద్రం మాపై ఉసిగొల్పుతోంది.. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు, మోడీ సమన్లు.. ప్రధానికి అదాని బినామి.. ఎల్‌ఐసీ డబ్బులు ఆవిరైతే దేశ ప్రధాని ఉలకడు, పలకడన్నారు మంత్రి కేటీఆర్.
దేశంలో 8 ఏళ్లగా జుమ్లా.. లేకపోతే హమ్లా నడుస్తోంది. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. మా నాయకులు 12 మందిపై ఈడీని, సీబీఐని పంపించారు. ఇవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు. ప్రతి పక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి. గౌతం అదానీ ఎవరి బినామీ..? అదానీ.. మోదీ బినామీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు.