సీఎం కేసీఆర్​కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

-

ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. కేసీఆర్​కు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చిరకాలం ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రి కేసీఆర్​కు విషెస్ చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్​లు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలో నిర్వహించిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. సీఎం బర్త్ డే సందర్భంగా సిద్దిపేటలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news