ప్రధాన మంత్రి మోడీ బయోపిక్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది..త్వరలోనే ప్రధాన మంత్రి బయోపిక్ సినిమా విడుదలకు సర్వం సిద్దమైనట్లు తెలుస్తుంది..భారత ప్రధాని నరేంద్రమోదీ జీవిత నేపథ్యంలో ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ రూపొందగా, ఈ చిత్రాన్ని 2019 ఎన్నికల ముందు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు..ఎన్నికల సాధరణ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, ప్రతి పక్షాలు,రాజకీయ పార్టీలు అభ్యంతరాలు చెప్పటంలో కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలపై తాత్కాలికంగా వాయిదా వేసింది..ఎన్నికల కోడ్ మగిసిన తర్వాత సినిమా చిత్రాన్ని రిలీజ్ చేశారు..ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా మోదీ జీవిత పయనం ఎలా సాగిందో ఈ సినిమా లో చూపించారు..పీఎం నరేంద్రమోదీ బయోపిక్ రిలీజ్ సమయంలో అనేక వివాదాలు తలెత్తడంతో సినిమాకు ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.
ఈ నేపథ్యంలో కరోనా అన్‌లాక్ ముగిసిన తర్వాత థియేటర్స్ క్రమంగా ఓపెన్ అవుతుండటంతో చిత్రాన్ని తిరిగి రిలీజ్ చేయాలని నిర్మాత సందీప్ సింగ్ భావిస్తున్నారట..కరోనా లాక్ డౌన్ తర్వాత పీఎం నరేంద్రమోదీ సినిమా విడుదల కావడంతో ప్రేక్షకుల్లో అసక్తి మరింతపెరిగింది.ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల చేయలేదు..కనీసం టీవీలో కూడా ప్రసారం చేయలేదు..ప్రేక్షకులు థియేటర్లలో మాత్రమే ఈ చిత్రాన్ని చూడాలని అప్పుడే మోడీ బయోపిక్‌కు న్యాయం చేసినట్లు జరుగుతుందని డైరెక్టర్ ,నిర్మాణ బావిస్తున్నారట..ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మించారు. వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర పోషించారు.
మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న మోడీ బయోపిక్..కారణం ఇదే!..
-