దేశం కరోనా పైరస్ కేసులు పెరగడం తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరగడంతో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో పీఎం మోడీ తో పాటు ఉన్నత అధికారులు కూడా పాల్గొనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజ రోజు కు పెరుగుతుంది. ముఖ్యం గా ఓమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరుల విస్తరిస్తుంది. ఇప్పటికే దేశం 213 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. 15 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం ఓమిక్రాన్ పట్ల ఇప్పటికే అప్రమత్తం అయింది. అయినా.. ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటం తో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యం గా బూస్టర్ డోస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచం లో చాలా దేశాలు బూస్టర్ డోస్ ను పంపిణీ చేస్తున్నారు. ఓమిక్రాన్ ను అడ్డుకోవలంటే.. బూస్టర్ డోస్ తప్పదని అంతర్జాతీయ వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే బూస్టర్ డోస్ పై నేటి సమీక్షా సమావేశం ముగిసన తర్వాత మోడీ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.