మోదీ నా మజాకా: 5 కోట్ల మంది కోసం రూ. 61 వేల కోట్లు…

-

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పధకాలను తీసుకువచ్చింది. అందులో ఒకటి ఆయుషుమాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు లబ్ధిని పొందారు అని చెప్పాలి, వీరందరూ హాస్పిటల్స్ లో ఈ పధకం కింద చికిత్సను తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 5 కోట్ల మంది చికిత్సను చేయించుకున్నారు. కాగా వీరి చికిత్స నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ ఖర్చు చేసింది అక్షరాలా రూ. 61501 కోట్లు అని తెలిపింది. ఈ పధకం లో లబ్దిని పొందడానికి మొత్తం 23 .39 కోట్ల మంది అప్లై చేసుకున్నారు.

 

దేశంలో వివిధ నగరాలలో మొత్తం హాస్పిటల్స్ కు ఈ పధకం ద్వారా ప్రజలకు చికిత్సను అందించవచ్చని అనుమతులు ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఈ పధకం ద్వారా 5 లక్షల వరకు చికిత్సను పొందగలరు.

Read more RELATED
Recommended to you

Latest news