బ్యాంకులపై మోడీ తనదైన ముద్ర.. ప్రభుత్వ రంగంలో 12, ప్రైవేట్ సెక్టార్‌లో నాలుగే!
దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన బ్యాంకుల విలీన ప్రక్రియపై మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ పెరుగుతున్న బ్యాంకు మోసాలను అరికట్టడంతోపాటు భారీ ఎత్తున తీసుకుంటున్న కార్పొరేట్ రుణాల ఎగవేతను అరికట్టేందుకు కీలక మైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే దేశంలో నల్లధనం చలామణిని అరికట్టేందుకు 2016లో మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఇప్పటి వరకు కుదురు కోలేదని సమాచారం. దీనికారణంగానే చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు దివాళా తీశారు.
ఇక, ఇప్పుడు బ్యాంకుల విలీనం అనే విషయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. ఇది కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించక పోదని అంటున్నారు. ఏదేమైనా .. తాను చేయాలని అనుకుంటున్న పనిని చేసి చూపుతున్న మోడీ.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకుల సంఖ్యను భారీ ఎత్తున కుదించాలని కేంద్రం నిర్ణయించుకుంది. దీంతో ఇప్పటి వరకు విచ్చలవిడిగా పెరిగిపోయిన బ్యాంకులు ఇకపై కేవలం భారీ సంఖ్యలో తగ్గిపోనున్నాయి.
తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సమచారం ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు ఉన్న 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేవలం 12 మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అదేసమయంలో ప్రైవేటు బ్యాంకుల సంఖ్య నాలుగు కు తగ్గిపోనుంది. ఇప్పటివరకు ఇండియాలో 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని,ఇవాళ చేసిన ప్రకటనతో ఇకపై దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో విలీన ప్రక్రియ గతంలోనే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం 10 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి.
అయితే, తాజాగా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇకపై పది నుంచి 4 బ్యాంకులు మాత్రమే ప్రైవేటు సెక్టార్‌లో ఉంటాయి. అవి వరుసగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB),ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లు విలీనం అవబోతున్నాయి. సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంక్ విలీనం ద్వారా 15.20లక్షల కోట్ల బిజినెస్ తో నాల్గవ అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుగా అవతరించబోతోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఇకపై ఒకే బ్యాంకుగా అయ్యి ఐదవ అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ గా అవతరించనున్నాయి. అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ విలీనం ద్వారా 8.08లక్షల కోట్లతో ఏడవ అతిపెద్ద బ్యాంక్ గా మారనుంది. మొత్తానికి ఈ నిర్ణయం ఏమేరకు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుందో చూడాలి.