మొబైల్స్ తయారీదారు పోకో భారత్‌లో కొత్తగా పోకో ఎం2 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. వెనుక వైపు 13, 8, 5, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలను అమర్చగా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
పోకో ఎం2 స్పెసిఫికేషన్లు…
* 6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 13, 8, 2, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ బ్రిక్ రెడ్, పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,499గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో రూ.750 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు.