కేవ‌లం రూ.1599కే రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్‌

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ కొత్త‌గా రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ బ్యాండ్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 1.08 ఇంచుల చ‌తుర‌స్రాకార క‌ల‌ర్ టచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ బ్యాండ్ 14 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంది. దీనికి బిల్టిన్ చార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. యూఎస్‌బీ పోర్టు కావ‌డంతో దీన్ని పీసీకి సుల‌భంగా క‌నెక్ట్ చేసుకుని కూడా చార్జింగ్ చేసుకోవ‌చ్చు.

xiaomi launched redmi smart band in india

ఈ బ్యాండ్‌లో హార్ట్ రేట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. యాక్టివిటీ ట్రాక‌ర్ ఉంది. స్లీప్ మానిట‌ర్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. సెడెంట‌రీ రిమైండ‌ర్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. బ్లూటూత్ 5.0 ద్వారా ఈ బ్యాండ్ ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. స్టెప్ కౌంట‌ర్‌, యాప్స్‌, కాల్స్ నోటిఫికేష‌న్లు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.

ఈ బ్యాండ్‌లో ఉన్న 130 ఎంఏహెచ్ బ్యాట‌రీ వ‌ల్ల బ్యాటరీ బ్యాక‌ప్ ఎక్కువ వ‌స్తుంది. ఈ బ్యాండ్ బ్లాక్ క‌ల‌ర్ స్ట్రాప్స్‌తో బ్లూ, బ్లాక్‌, గ్రీన్‌, ఆరెంజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.1599 ధ‌ర‌కు ఈ బ్యాండ్‌ను వినియోగ‌దారులు అమెజాన్ లేదా ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్‌ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 9 నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news