రాష్ట్రంలో అపరిష్కారంగా ఉన్న సమస్యలో ముఖ్యమైనది పోడు వ్యవసాయం. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి నిరసలను కూడా తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ వచ్చిందంటే రాష్ట్రంలో ఎక్కడోచోట పోడు వ్యవసాయంపై ఘర్షణ ఏర్పడుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశంలో పోడు వ్యవసాయంపై రైతులకు సీఎం గుడ్ న్యూస్ తెలిపారు. పోడు పరిష్కారానికి ఈనెల 3వ వారం నుంచి దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడించారు.
ఇప్పటి వరకు ఉన్న పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని నిజమైన పోడు రైతులకు వారికి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు అడవును కొట్టి సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించనున్నారు. కొత్తగా అడవులను నరికి సాగు చేద్దాం అనుకునే వారిని మాత్రం ప్రభుత్వం ఉపేక్షించదని సీఎం కేసీఆర్ హెచ్చిరించారు. ప్రతీ ఏటా పోడు సమస్య వల్ల ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. దీంతో ప్రభుత్వం పోడు సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో ఉంది.