డేంజరెస్ ట్రైలర్…రెచ్చిపోయిన వర్మ భామలు..!

-

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ విడుదల చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా లెస్బియన్ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డేంజరస్ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో అప్సరా రాని, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. దేశంలోనే ఇది మొదటి లెస్బియన్ యాక్షన్ క్రైమ్ చిత్రం కావడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వర్మ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ టైటిల్ కు తగ్గట్టు ఎంతో డేంజర్ గా కనిపిస్తోంది. ట్రైలర్ లో వర్మ భామలు అప్సరా మరియు నైనా గంగూలీ రెచ్చిపోయారు. లెస్బియన్ ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కడంతో కథకు తగ్గట్టుగా వర్మ చూపించేశాడు. అంతే కాకుండా అదే రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలను జోడించారు. ఇక మూడు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ప్లాపులు తప్ప వర్మకు హిట్లు లేవన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news