నేడు ఆసిఫాబాద్​కు కేసీఆర్.. పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం

-

పోడు భూములను సాగు చేసుకునే గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు ఇవాళ పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లా నుంచే పోడు పట్టాల పంపిణీకి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, జిల్లా పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​ కుమార్ పోడుపట్టాలు పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాఠోడ్ పోడుపట్టాలు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు సిద్ధమయ్యాయి. 1,51,146 మంది పోడు రైతులు పట్టాలు అందుకోనున్నారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది రైతులకు 1,51,195 ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 24,181 మంది రైతులకు 67,730 ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15,519 మంది రైతులకు 47,138 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news