హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ కేటుగాళ్లను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పుణెకు చెందిన సంగత్ సింగ్ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ప్లాన్ చేసిన ఏరియాలో ముందుగా రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. ఐరన్ రాడ్, స్క్రూడ్రైవర్ వంటి వస్తువులతో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై మొత్తం మహారాష్ట్రలో 17 కేసులు, హైదరాబాద్‌లో 4 కేసులు ఉన్నాయి. దొంగతనాలు చేయడంలో వీళ్లు ఆరితేరినోళ్లు.. చివరకు బుక్కయ్యారు.
పోలీసులకు చిక్కకుండా ఇళ్లు మారడం..బైక్‌లకు ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టడం సంగత్ సింగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మరో నిందితుడు అక్షయ్ పాపట్‌తో కలిసి సంగత్ సింగ్ ఇటీవల పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడి ఆ తర్వాత పరారయ్యారు. పోలీసులు తమదైన శైలిలో విచారించి సంగత్ సింగ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఐదు లక్షల విలువైన 176 గ్రాముల బంగారంతో పాటు 2 కిలోల వెండి, ఐదు ఫోన్లు, ద్విచక్రవాహనాన్నిస్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు వినియోగించిన వస్తువులను సీజ్ చేశారు.