టోక్యో ఒలింపిక్స్ Tokyo Olympics గేమ్స్ లో అథ్లెట్లకి అట్టముక్కలతో చేసిన బెడ్లని ఇచ్చారు. గేమ్స్ విలేజ్ లో శృంగార కార్యకలాపాలు కొనసాగించకూడదన్న ఉద్దేశ్యంతో ఈ విధమైన ఆలోచనతో బెడ్లను సమకూర్చారు. ఐతే సెక్స్ అనేది ఒలింపిక్ గేమ్స్ లో కామన్ అనీ మాజీ ఆటగాళ్ళు చెబుతున్నారు. ఈ విషయంలో మాజీ ఆటగాళ్ళు బయటపెట్టిన విశేషాలు చూస్తే,
జర్మనీకి చెందిన లాంగ్ జంపర్ సూసెన్ టైడ్కీ చెప్పిన వివరాల ప్రకారం గేమ్స్ విలేజ్ లో సెక్స్ అనేది ఉంటుందని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని అంటున్నారు. సెక్స్ నిషేధం అనేది పెద్ద జోక్ అనీ, అది పనిచేయదని, గేమ్స్ విలేజ్ లో సెక్స్ అనేది ఎప్పుడూ ఒక ఇష్యూగా ఉంటుందని తెలిపాడు.
1992, 2000సంవత్సరాల్లో ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొన్న సూసేన్ చెప్పిన దాని ప్రకారం శృంగార కోరికల్తో వెర్రెత్తిపోయే వారిని ఎవ్వరూ ఆపలేరని, అదీగాక అక్కడ జరిగే పార్టీలు, అందులో ఆల్కహాల్ మొదలగు సేవనం ఉండడం, తెల్లవార్లు నిద్రలేకపోవడం జరుగుతుంటుందని అంటున్నారు.
శృంగారం వల్ల శరీరంలో కొత్త శక్తి ఉత్పత్తి అవుతుంది. చాలా సార్లు ఈ విషయంలో రూమ్ మేట్స్ సాయం చేస్తారు. తమ తోటి ఆటగాళ్ళ అవస్థను అర్థం చేసుకుని గది ఖాళీ చేసి వెళ్తుంటారు. ఇక్కడ ఎవరూ ఏదీ బలవంతంగా చేయరు. శరీరంలో కొత్త ఉత్తేజం వచ్చి ఉత్సాహంగా ఉండడానికి సెక్స్ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
హోప్ సోలో.. అమెరికాకి చెందిన బంగారు పతక విజేత చెప్పిన దాని ప్రకారం, గేమ్స్ విలేజ్ లో శృంగారం చాలా ఎక్కువ అని, కొన్ని కొన్ని సార్లు అది బహిరంగంగా జరుగుతుంటుందని, గడ్డిపొదల వెనక దాక్కునే చాలామందిని నేను చూసానని చెప్పుకొచ్చారు. Tokyo Olympics యాంటీ సెక్స్ బెడ్స్