ప్రొఫెసర్ కోదండరాం పై పోలీసుల దాడి !

-

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్… రైతు చట్టాలను తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైతు చట్టాలను… వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు మరియు వామపక్షాలు భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ టిఆర్ఎస్, బిజెపి మినహా అన్ని పార్టీలు ఈ భారత్ బంద్ లో పాల్గొన్నాయి. అయితే ఈ భారత్ బందులో పాల్గొన్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఈ భారత్ బందులో పాల్గొన్న ఆయన పట్ల పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసులు ఆయనపై చేసిన దాడి లో… ప్రొఫెసర్ కోదండరాం… దుస్తులు కూడా చినిగి పోయాయి. ఈ ఘటన అందరినీ కలిసి వేస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ మరియు వామపక్షాలు మండిపడ్డాయి. తెలంగాణ యోధుడు కోదండరాం సార్ పట్ల పోలీస్ ల అనుచిత ప్రవర్తన ఆక్షేపనీయమని…ఈ ఘటన పై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్ లో పాల్గొన్న కోదండరాం పట్ల ఉద్దేశ్య పూర్వకంగా పోలీసులు టార్గెట్ చేశారని మండిపడ్డారు నేతలు. అరెస్టు సందర్భంగా పోలీస్ లు ఓవరాక్షన్ చేశారని… కోదండరామ్ పై పోలీస్ ల బల ప్రయోగం చేశారని ఫైర్ అయ్యారు విపక్ష నేతలు. ఒంటి మీద బట్టలు చించివేసి దారుణంగా వ్యవహరించారని.. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news