పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి గౌతమ్ రెడ్డి. పోలీసులు అర్థరాత్రి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దాదాపు 30 మందికి పైగా కరెంట్ తీసెసి ఇంట్లోకి దౌర్జన్యంగా చోరబడ్డారని తెలిపారు. పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించే పద్దతి ఇది కాదు అన్నారు.
పోలీసులు వచ్చిన సమయంలో మా నాన్న లేరు కాబట్టి ఆయన బతికి ఉన్నారని అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు. మా తల్లికి 66 ఏళ్లు ఆమెకు అనారోగ్య సమస్యలున్నాయి. అర్థరాత్రి బెడ్రూమ్ తలుపులు బాదుతూ ఆమెను ఇబ్బంది పెట్టారు. డోర్లు వేసుకోకుండా పడుకున్నారేంటంటూ పోలీసులు రివర్స్ లో దబాయించారని లిఖిత ఆవేదన వ్యక్తం చేసారు. గౌతమ్ రెడ్డిని ఎక్కడ దాచావ్..? ఎక్కడికి వెళ్లాడు. ఎక్కడెక్కడికి వెళ్తాడంటూ భయపెట్టారు. పోలీసు తీరు చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగంలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది లిఖిత.