ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా వీడాల్సిన చిక్కుముడులు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకూ కోడెల సెల్ ఫోన్ మాత్రం పోలీసులకు లభించలేదు. సెల్ ఫోన్ దొరికితే చాలా విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
సెల్ ఫోన్ అదృశ్యం కావడంతో దాన్ని కుటుంబ సభ్యులే తీసి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దిశగానూ విచారణ సాగిస్తున్నారు. సెల్ ఫోన్ లేకపోవడం వల్ల ప్రస్తుతం కోడెల కాల్ డేటాను విశ్లేషించి.. దాని ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. ఈ కాల్ డేటాలో ఇంట్రస్టింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ రావు హైద్రాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొకున్నారు. ఆ రోజు ఆయన దాదాపు 15 మందితో మాట్లాడినట్టు పోలీసులు భావిస్తున్నారు. అందులో బసవతారకం ఆసుపత్రి సిబ్బంది ఒకరితో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగానూ విచారణ సాగిస్తున్నారు.
ఆయన కోడెల తన చిట్టచివరి కాల్ మాత్రం ఆయన గన్ మెన్ కు చేశారట. అది కూడా కేవలం 9 సెకన్లు మాత్రమే మాట్లాడటం విశేషం. ఆ కాల్ తర్వాత కోడెల ఇంకెవరకీ కాల్ చేయలేదు. ఆ కొద్దిసేపటికే కోడెల శివప్రసాదరావు ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం 9 నిమిషాలు అంటే పెద్దగా సంభాషించే అవకాశం ఉండదు.
ఇక ఈ కేసు విచారణ ముందుకు సాగాలంటే కోడెల సెల్ ఫోన్ దొరకాలి.. లేదా ఆయన కుటుంబ సభ్యులైనా విచారించాలి. సెల్ ఫోన్ దొరికే అవకాశాలు కనిపించడంలేదు. మరి కోడెల కుటుంబ సభ్యులు విచారణలో ఏం చెబుతాన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.