నందిగామ రోడ్ షోలో టిడిపి అధినేత నారా చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆ పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిజిపి కి లేఖ రాశారు. చంద్రబాబుపై కుట్రపూరితంగా దాడి చేసి, ఒక పోలీసు అధికారికి గాయాలైనప్పటికీ.. కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
ఈ ఘటనపై పోలీసులు ఐపిసి 120 బి, 332 సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుండా.. 324 కింద కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలకు కారణమైన డిఎస్పి, సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేసి సరైన సెక్షన్లతో తిరిగి కేసు నమోదు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక అధికార పార్టీ గుండాలు ఇలా దాడులకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.