కరోనా వైరస్ దెబ్బతో మనుషుల్లో మానవత్వం రోజురోజుకి చంపేస్తుంది. భారతదేశంలో ఎవరైనా చనిపోతే వారికి ఎంతో విలువ ఇచ్చి అంత్యక్రియలు చేస్తారు. అయితే భారతదేశంలో తాజా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒకవేళ ఎవరైనా కరోనా వైరస్ తో వ్యక్తి మృతి చెందితే వారిని కుక్కల కంటే హీనంగా భావిస్తున్నారు. వారి అంత్యక్రియలను చేసేందుకు వారి బంధువులు స్నేహితులు కాదు కదా, చివరికి రక్త సంబంధీకులు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వీరి అంత్యక్రియలు చివరికి మున్సిపల్ సిబ్బంది చేయాల్సి వస్తుంది.
అయితే తాజాగా తిరుపతిలో జెసిబి సహాయంతో మట్టిలో కరోనా పేషెంట్ మృతదేహాన్ని పూడ్చుతున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ గా అతను రుయా ఆస్పత్రిలో చేరగా అతను కోలుకోలేక మృత్యువాత పడ్డాడు. అయితే నేడు ఆయన మృతదేహానికి తిరుపతి మున్సిపల్ సిబ్బంది అంతక్రియలు నిర్వహించారు. సదరు కరోనా పేషెంట్ శవాన్ని ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో శవాన్ని తీసుకు వచ్చి నేరుగా స్మశాన వాటికలో గుంత తీసి జెసిబి తో మట్టి కప్పేశారు. నిజంగా ఇలాంటి సంఘటనలు జరగడం విచారించదగ్గ విషయమే.